వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం.. కొడంగల్ మండలం చిట్లపల్లి గేటు సమీపంలో శుక్రవారం రాత్రి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. వారిలో మహిళ, పురుషుడు ఉన్నారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.