ఝాన్సీ 1857 విప్లవానికి ప్రధాన కేంద్రంగా మారింది. బ్రిటిష్ వారు లక్ష్మీబాయి పేరు వింటే చాలు వణికిపోయేవారు. ఝాన్సీ లక్ష్మీబాయి గుర్రం కళ్లాన్ని పళ్ల మధ్య అదిమి పట్టి తన రెండు చేతులతో కత్తులు తిప్పుతూ ఒకేసారి ఇరువైపులా ఉన్నవారితో యుద్ధం చేసేవారు. బ్రిటిష్ వారి పేరు చెబితే చాలు రాణి ఆగ్రహించేవారు. బ్రిటిషర్లు ఝాన్సీపై యుద్ధం ప్రకటించిన్నప్పుడు దాదాపు 12 రోజుల పాటు బ్రిటిష్ సేనలను ఎదురొడ్డి పోరాడారు.