విశాఖలో లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ప్రేమ, పెళ్లి పేరుతో ఆ యువతికి దగ్గరైన ప్రియుడే ఆమెను మోసగించాడు. వీరు ఏకాంతంగా గడిపిన వీడియోను చూపించి అతడి స్నేహితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత తమ కోరిక తీర్చాలని వేధించారు. అందుకు ఆమె నిరాకరించింది. ప్రియుడు సైతం వారి కోరిక తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకోబోయింది. తండ్రి కాపాడి ప్రశ్నించడంతో ఈ విషయం బయటపడింది.