మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని నర్సింగ్‌గఢ్ ప్రాంతంలోని దారుణం జరిగింది. అక్కడి ఓ 11 ఏళ్ళ మానసిక వికలాంగ బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను నిందితుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని సమాచారం. బాలికకు వినికిడి లోపం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత బాలిక తన 80 ఏళ్ళ బామ్మముతో కలిసి ఒక గుడిసెలో నివాసం ఉంటుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.