అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల నమోదైన భూకంప సమయంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆకర్షించింది. సాన్‌డిగో జూపార్క్‌లో జరిగిన ఈ దృశ్యంలో చిన్న ఏనుగులను రక్షించేందుకు పెద్ద ఏనుగులు ఓ సర్కిల్ రూపంలో గుంపుగా కాపలా కాసాయి. ఈ ‘అలెర్ట్ సర్కిల్’ విధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.