రాస్బెర్రీస్ పండుతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ సీ, ఇ, ఆంథోసైనిన్, ఎల్లాజిక్ ఆమ్లం ఉంటాయి. రాస్బెర్రీస్ పండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె ప్రమాదాన్ని అదుపులో ఉంచుతుంది. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో రాస్బెర్రీస్ పండ్లు సహాయపడతాయి.