భారత స్టార్ క్రికెటర్ ధోనీ వికెట్ కీపింగ్ నైపుణ్యాన్ని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కొనియాడాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఫేమ్‌లో ధోనీని చేర్చిన సందర్భంగా రవిశాస్త్రి లండన్‌లో మాట్లాడాడు. ‘ధోనీ చేతులు పిక్ పాకెటర్ కంటే వేగంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా భారత్‌లో.. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో మ్యాచ్‌కి వెళ్తే మీ వెనుక ధోనీ ఉండకుండా చూసుకోండి. లేదంటే మీ పర్స్ మాయమైపోతుంది’ అని రవిశాస్త్రి సరదాగా వ్యాఖ్యానించాడు.