భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశీయ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం నమోదిత కంపెనీల్లో విదేశీ వ్యక్తులు పెట్టుబడి పెట్టే పరిమితి 5%గా ఉంది. అయితే, దీనిని 10%కు పెంచే యోచనలో ఉంది. ఈ నిర్ణయం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, భారత మార్కెట్‌ను మరింత బలోపేతం చేయడంలో సహాయపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.