ఆర్సీబీ ఫ్రాంచైజీని పూర్తిగా లేదా అందులో కొంత వాటాను విక్రయించడానికి యాజమాన్యం సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్సీబీలో వాటాలు కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆయన స్పందించారు. ‘ నేను నా చిన్నప్పటి నుంచి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యుడిని. ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో భాగస్వామిగా చేరాలని ఆఫర్‌లు ఉన్నప్పటికీ నాకు సమయం లేదు. నాకు ఆర్సీబీ ఎందుకు అవసరం?’ అని డీకే శివకుమార్ అన్నారు.