ఆర్సీబీ.. 17 ఏళ్ల కలకు తెరదించుతూ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఫ్రాంచైజీని పూర్తిగా లేక కొంత షేర్‌ను అమ్మేందుకు యాజమాన్యం నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. ఆర్సీబీ విలువ రెండు బిలియన్ డాలర్లు (రూ.16వేల కోట్లు) ఉంటుందని బ్లూమ్ బెర్గ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీని బ్రిటిష్ డిస్టిలర్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌ల మాతృ సంస్థ ‘డియాజియో పీఎల్సీ’ నడిపిస్తుంది. ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.