ఆర్సీబీ లక్ష్యం 174 పరుగులు

73చూసినవారు
ఆర్సీబీ లక్ష్యం 174 పరుగులు
ఐపీఎల్ 2025లో జైపూర్ వేదికగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RR జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్‌ (75) అర్థశతకంతో రాణించారు. RCB బౌలర్లలో యష్, హేజిల్‌వుడ్‌, కృనాల్‌, భువీ తలో ఒక వికెట్‌ తీశారు.

సంబంధిత పోస్ట్