ఐపీఎల్ 2025లో భాగంగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీ సాధించారు. ఫిల్ సాల్ట్ చెలరేగి ఆడుతూ కేవలం 27 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. SRH బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఫిల్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్‌కు తెరలేపారు. IPL కెరీర్‌లో ఫిల్ సాల్ట్‌కు ఇది 9వ అర్థశతకం. దీంతో 10 ఓవర్లకు RCB స్కోర్ 118/1గా ఉంది. క్రీజులో మయాంక్ అగర్వాల్ 10, ఫిల్ సాల్ట్ 55 పరుగులతో ఉన్నారు.