2026లో జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలొ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 19%కి పడిపోతుందని హెచ్చరించారు. ఇది దక్షిణ రాష్ట్రాలకు నష్టం కలిగించి, వాటి ఓట్లు, ప్రాతినిధ్యం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు దారితీస్తుందని ఆయన అన్నారు. అందుకే ఒక పార్టీ దక్షిణాదిపై ప్రణాళికాబద్ధంగా దాడి చేస్తోందని ఆరోపించారు.