రాజస్థాన్ శ్రీ గంగానగర్‌లో ఇవాళ అత్యధికంగా 49.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ ఏడాది దేశవ్యాప్తంగా నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర గరిష్ఠ ఉష్ణోగ్రత కారణంగా స్థానికులు తీవ్ర వేడిమికి గురవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే మాత్రమే బయటికి రావాలని హెచ్చరిస్తోంది.