TG: నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలో అన్ని గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో కేసులు వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టులో కేసులను అధిగమించి నియామకాల ప్రక్రియ చేపడతామని ఆయన వెల్లడించారు.