AP: అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి డిమాండ్ తగ్గడం, చైనా, బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు లేకపోవడంతో ధర భారీగా పతనమైంది. గత ఏడాది క్వింటాకు రూ.35 వేలు ధర పలికింది. ఇప్పుడు రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.17 వేల లోపే ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి. ఎకరాలో మిర్చి సాగుకు గతేడాది రూ.లక్ష ఖర్చయితే, ఈ ఏడాది రూ.3 లక్షలు ఖర్చయ్యింది. పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు కుదేలవుతున్నారు.