ఎర్రనల్లి పురుగు ఉద్ధృతి పొడి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు ప్రోపార్లైట్ 1.5 మి.లీ/లీటర్ నీటికి (లేదా) వావిలాకు కషాయం (లేదా) గంధకపు పొడిని ఎకరాకు 8 నుంచి 10 కేజీలు చల్లుకోవాలి (లేదా) స్పెరోమెసిఫాన్ 1-1.25mlను లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేలా ముఖ్యంగా అడుగు భాగాన తడిచేలా పిచికారీ చేయాలి.