వరంగల్ కొత్తవాడలో ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్ వల్ల ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ తీసుకున్న ఓ వీడియో వైరల్ కావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. సుమారు 50 మంది యువకులు, మహిళలు రెచ్చిపోయి మారణాయుధాలతో తలపడడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇరుకుటుంబాల సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.