రీల్స్ పిచ్చి యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది(వీడియో)

61చూసినవారు
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు యువతీ యువకులు ప్రమాదకరమైన రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. ఈ మేరకు ఓ యువకుడు ఓ రహదారిపై వేగంగా బైక్ నడుపుతుండగా అతడిని మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ క్రమంలో ఓ మూలమలుపు వద్ద బైక్ ను కంట్రోల్ చేయలేక బైకర్ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొని కిందపడ్డాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు.. కానీ ఈ వీడియో వైరల్ అవుతొంది.

సంబంధిత పోస్ట్