ఒడిశాలో ఓ బాలుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రమాదకర స్టంట్స్ వేశాడు. లైకుల కోసం రైలు వస్తుండగా ట్రాక్‌పై పడుకున్నాడు. ట్రైన్ వెళ్లిపోయేవరకూ ట్రాక్‌పైనే ఆ బాలుడు పడుకోగా.. అతడి స్నేహితులు వీడియో తీశారు. ఈ వీడియో చూసిన బౌధ్ పోలీసులు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్స్ కోసం ఎంతకు తెగిస్తున్నార్రా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.