'ఆపరేషన్ సిందూర్' లో కీలక పాత్ర పోషించిన కల్నల్ సోఫియాపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేయాలని MP హైకోర్టు ఆదేశించింది. ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేస్తే.. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పంపించి గుణపాఠం నేర్పించారని అన్నారు. ఆయనపై FIR నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.