సరస్వతీ పవర్ ప్లాంట్‌కు కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్లు రద్దు

53చూసినవారు
సరస్వతీ పవర్ ప్లాంట్‌కు కేటాయించిన భూముల రిజిస్ట్రేషన్లు రద్దు
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు కూటమి సర్కార్ షాకిచ్చింది. జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించిన భూముల్లో ఉన్న అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు మాచవరం (మ) వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయని గుర్తించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారులు అసైన్డ్ ల్యాండ్స్ గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్