UGC-NET 2024 జూన్ పరీక్షల రీషెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 83 సబ్జెక్టుల్లో జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత, పీహెచ్‌డీలో ప్రవేశాల నిమిత్తం ఏటా రెండు సార్లు ఈ పరీక్షలు జరుగుతుంటాయి. ఇటీవల పేపర్ లీక్ కావడంతో UGC-NET 2024 జూన్ పరీక్షలు రద్దు అయ్యాయి. దీంతో మరోసారి UGC-NET పరీక్షలను నిర్వహించనున్నారు.