రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తాజాగా స్పోర్ట్స్ హైడ్రేషన్ డ్రింక్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి స్పిన్నర్ పేరుతో ఈ డ్రింక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పటికే కంపా కొలా పేరుతో కూల్‌డ్రింక్స్‌ను విక్రయిస్తున్న సంస్థ తాజాగా విడుదల చేసిన 150ml సింగిల్-సర్వ్ బాలిల్ కలిగిన స్పోర్ట్స్ డ్రింక్ ధర రూ.10గా నిర్ణయించింది.