స్పోర్ట్స్ డ్రింక్స్ మార్కెట్‌లోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగుపెట్టింది. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి ‘స్పిన్నర్’ పేరిట కొత్త స్పోర్ట్స్ డ్రింక్‌ను సోమవారం విడుదల చేసింది. దీని ధరను కేవలం రూ.10గా ప్రకటించింది. లెమన్, ఆరెంజ్, నైట్రో బ్లూ ఫ్లేవర్లలో ఈ డ్రింక్ లభిస్తుంది. స్పిన్నర్‌ను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చేందుకు వివిధ ఐపీఎల్ టీమ్‌లతో జట్టుకట్టినట్లు రిలయన్స్ తెలిపింది.