బీజేపీ నాయకులు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం అతిశీకి ప్రత్యేక కోర్టు మంగళవారం ఊరట కలిగించింది. ఈ కేసులో అతిశీకి మేజిస్ట్రియల్ కోర్టు జారీ చేసిన సమన్లను ప్రత్యేక కోర్టు జడ్జి విశాల్ గోన్నే రద్దు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగానే అతిషి ప్రకటనలు చేశారని, వ్యక్తిగతంగా పరువునష్టం చేసే వ్యాఖ్యలు చేయలేదని అతిషి తరుపు న్యాయవాది చేసిన వాదనలను అంగీకరిస్తూ జడ్జి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.