TG: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మొయినాబాద్ వద్ద ప్రైవేటు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న కేసులో అత్యున్నతన్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మొయినాబాద్ భూ వ్యవహారంలో జీవన్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసి, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.