ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ జేమ్స్ ఫోలే క్యాన్సర్‌తో మృతి

80చూసినవారు
ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ జేమ్స్ ఫోలే క్యాన్సర్‌తో మృతి
ప్రముఖ అమెరికన్ దర్శకుడు జేమ్స్ ఫోలే (71) బ్రెయిన్ క్యాన్సర్‌తో మృతిచెందారు. నిద్రలోనే తుదిశ్వాస విడిచారని ఆయన ప్రతినిధి వెల్లడించారు. ఫోలే దర్శకత్వం వహించిన ప్రముఖ సినిమాల్లో ఎట్ క్లోజ్ రేంజ్, గ్లెంగారీ గ్లెన్ రాస్, ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే సిరీస్ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ హౌస్ ఆఫ్ కార్డ్స్‌కి సంబంధించిన పలు ఎపిసోడ్‌లను కూడా ఆయన రూపొందించారు. ఆయన మరణంతో హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్