ప్రముఖ కథక్ నృత్యకారిణి, కొరియోగ్రాఫర్ కుముదిని లఖియా(95) కన్నుమూశారు. కుముదిని లఖియాకు 2010లో పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. 1987లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అందుకున్నారు. ఆమె 1967లో భారతీయ నృత్యం, సంగీత సంస్థ అయిన కదంబ్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్‌ను స్థాపించారు. కుముదిని మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.