తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సబ్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిటీ తన నివేదికను సబ్ కమిటీకి అందజేసింది.