దేశ ప్రజలు 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది. రాజస్థాన్ సంస్కృతికి ప్రతీకగా ఆయన ‘సఫా’ను ధరించారు. ఏటా స్వాతంత్రర్య , గణతంత్ర వేడుకలకు ప్రధాని విభిన్నమైన తలపాగాలు ధరించి హాజరవుతారన్న విషయం తెలిసిందే.