5 ఎకరాల్లోపే 'రైతుభరోసా' ఇవ్వాలని వినతి

72చూసినవారు
5 ఎకరాల్లోపే 'రైతుభరోసా' ఇవ్వాలని వినతి
'రైతుభరోసా' పెట్టుబడి సాయాన్ని 5 ఎకరాలలోపు రైతులకే అమలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. బీడు భూములకు, వందల ఎకరాలున్న వారికి పథకం అమలు చేస్తే ఖజానాపై భారం పడుతుందని పేర్కొంది. భూస్వాములు, ఐటీ చెల్లించే శ్రీమంతులను పథకానికి దూరం చేయాలని కోరింది. కౌలు రైతులను ఈ పథకంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా ఇవాళ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్