కాంగ్రెస్ సర్కార్ పేదలకు ఇస్తున్న సన్నబియ్యం పంపిణీకి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గతంలో 2.8కోట్ల జనాభాకు దొడ్డు బియ్యం ఇచ్చేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేశారని.. తాము 3.10కోట్ల మందికి సన్నబియ్యం ఇవ్వడానికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పదేళ్ల BRS హయాంలో పండని పంట, కాంగ్రెస్ హయాంలో పడిందని తెలిపారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.