రేవంత్ రెడ్డి నయాదేశ్‌ముఖ్ లాగా వ్యవహరిస్తున్నారని BRS నేత బాల్క సుమన్ విమర్శించారు. 'కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గురుకులాల వ్యవస్థను నీరు గారుస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ విద్యా శాఖను, సంక్షేమ శాఖను తన వద్ద పెట్టుకుని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 800 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురి అయ్యారని విమర్శించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని.. రేవంత్ శిఖండి రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.