KTRపై ప్రతీకారంతో రేవంత్ ప్రభుత్వం కేసులు పెడుతోందని BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. 'సెక్రటేరియట్‌లో లంకెబిందెలు ఉన్నాయని వచ్చానని రేవంత్ అన్నారు. ఇప్పటివరకు KTRపై 14 కేసులు పెట్టారు. KTR శ్వాస తీసుకుంటే కూడా కేసులు పెడుతున్నారు. KTRపై పెట్టిన కేసులో 4 కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఒకే అంశంలో KTRపై రెండు FIRలు పెట్టారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఏ రూల్ బుక్‌లో ఇలా ఉంది?' అని ప్రశ్నించారు.