14 నెలలుగా పాలమూరు ఎత్తిపోతలను కోల్డ్ స్టోరేజీలో పెట్టిన రేవంత్ సర్కారు.. ప్రాజెక్టుకు అనుమతుల సాధనను గాలికొదిలేసిందని BRS MLC కవిత విమర్శించారు. 'కేసీఆర్ పాలమూరుకు 90 TMCల నికర జలాలు కేటాయించి ప్రాజెక్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తే.. ఆ విషయాన్ని కేంద్రానికి సరిగా చెప్పలేక తుది అనుమతులను సంక్లిష్టం చేసింది. కృష్ణా జలాల నీటి కేటాయింపులు తేలేవరకు పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చిచెప్పింది' అని ట్వీట్ చేశారు.