రేవంత్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోందని BJP నేత, ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ పునరుజ్జీవనం కోసం ఇళ్లు కూల్చడం ఎందుకు? అని ప్రశ్నించారు. DPR లేకుండా అప్పుడే మార్కింగ్ ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. గత BRS ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారులు ఇళ్లను పేదవారికి విక్రయించారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీ నేతలే మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. శుక్రవారం జరిగే మహాధర్నాకు ప్రజలు తరలిరావాలన్నారు.