రియల్ ఎస్టేట్‌ వ్యాపారుల ఆత్మహత్యలకు రేవంతే కారణం: హరీశ్ రావు

61చూసినవారు
రియల్ ఎస్టేట్‌ వ్యాపారుల ఆత్మహత్యలకు రేవంతే కారణం:  హరీశ్ రావు
తెలంగాణలో రియల్ ఎస్టేట్‌ వ్యాపారుల ఆత్మహత్యలకు రేవంతే కారణమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంలో కాంగ్రెస్ డిజాస్టర్ అయిందని విమర్శించారు. మొన్న కొంపల్లిలో రాయల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య, నేడు ఆదిభట్లలో నరసింహ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లతో మొదలైన ఆత్మహత్యల పరంపర రియల్ ఎస్టేట్ రంగానికి చేరడం దురదృష్టకరమని చెప్పారు.

సంబంధిత పోస్ట్