ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 'ఎంత విషం చిమ్మినా.. తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం! మల్లన్నసాగర్ వద్దని నిరాహారదీక్షలు మీరు చేసినా.. నేడు మహానగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్నసాగర్! కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసినా.. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.