TG: ఫార్ములా-ఈ కార్ రేస్‌లో అసలు నిందితుడు రేవంత్ రెడ్డి అని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రేవంత్ రెడ్డిపై కేసు పెట్టానని, కానీ తనకు తెలియకుండానే పోలీసులు కేసును క్లోజ్ చేశారని పేర్కొన్నారు. సీఎం కాబట్టి కేసు పెట్టలేదని పోలీసులు అంటున్నారని, రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం చట్టంలో ఉందా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సోదరుల దౌర్జన్యంతో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.