గ్రూప్‌- 4 అభ్యర్ధులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

73చూసినవారు
గ్రూప్‌- 4 అభ్యర్ధులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌
రేవంత్‌ సర్కార్‌ ప్రజాపాలన విజయోత్సవాకు పిలుపునిచ్చింది. డిసెంబరు 1 నుంచి 9 వరకు రాష్ట్రమంతటా ఈ విజయోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన టీజీజీఎస్సీ గ్రూప్‌ 4 తుది ఫలితాల్లో ఉద్యోగాలు సంపాదించిన వారికి సీఎం రేవంత్‌ తీపి కబురు చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 4న పెద్దపల్లి జిల్లాల్లో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపనున్నారు. అదే వేదికగా గ్రూప్‌ -4 ఎంపికైన దాదాపు 9 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్