ఫించన్ల పెంపుపై NOV-2023లో సీఎం రేవంత్ హామీ ఇచ్చారని.. DECలో హామీ అమలు చేస్తానని చెప్పి ఇప్పటివరకు పెంచలేదని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. 'ఏపీ ఎన్నికల సమయంలో చంద్రబాబను కలిసి పింఛన్లు పెంచమని కోరగా.. అధికారంలోకి వచ్చాక ఆయన పెంచారు. మరి DEC-2023లో అధికారంలో వచ్చిన రేవంత్ ప్రభుత్వం పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదు. 16 నెలలు గడుస్తున్నా పింఛన్ ఇవ్వకుండా ఇంకొకరి మీద నెట్టడం సరికాదు' అని విమర్శించారు.