TG: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాల పాడును పైలట్ గ్రామ పంచాయితీగా ఎంపిక చేశారు. గత నెల 26న ఎమ్మెల్యే కోరం కనకయ్య మూడు గ్రామాల్లో మొత్తం 114 మందికి ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు. అయితే పది రోజుల్లోనే గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి మంజూరు పత్రాలను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.