TG: దుర్గం చెరువులో నీటిమట్టం నిర్వహణపై ఇరిగేషన్, జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు నిర్ణయించారు. దుర్గం చెరువు దిగువ భాగంలో ఆక్రమణలతో పాటు.. వరద కాలువకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు. అలాగే దుర్గం చెరువులో ఇనార్బిట్ మాల్ వైపు మట్టి పోయడంపై విచారించారు. అక్కడ పార్క్ చేసిన వాహనాలకు సంబంధించి వాకబు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.