TG: సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపైనా నివేదిక రూపొందించారు. రైతు బీమా ప్రీమియం చెల్లింపు, పంటల బీమా పథకం విధివిధానాలపై సమీక్షలో చర్చకు రానున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ పథకం, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (DCMS)ల విలీనం, వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్లను విలీనం చేయడంపైనా తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.