తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా లబ్దిదారులకు కొత్త కార్డులు ఇచ్చారు. కార్డులను పొందిన వారందరికీ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అవసరమైన కోటాను ఆయా జిల్లాలకు కేటాయించింది. కాగా వారికి ఈ నెల నుంచే బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.