మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. భద్రతా సిబ్బంది కుకీల మధ్య ఘర్షణ నెలకొంది. నిరసనకారులు ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు. ఇంఫాల్-దిమాపూర్ జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా 40 మందికి గాయాలయ్యాయి. మణిపూర్‌లో వాహనాలు స్వేచ్ఛగా రాకపోకలకు సాగించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుమతించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను నిరసిస్తూ ఆదోళన వ్యక్తం చేస్తున్నారు.