ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ హాఫ్ సెంచరీ సాధించారు. దీని ద్వారా IPL 2025లో LSG కెప్టెన్ రిషభ్ పంత్ తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశారు. పంత్ 42 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్‌లో కెరీర్‌లో పంత్‌కు ఇది 19వ అర్థశతకం. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ స్కోర్ 139/4గా ఉంది.