శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,20,419 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 67,009 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ, కుడి గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా కలిపి 67,009 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 876.90 అడుగులుగా ఉంది.