బిహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బిహార్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓటర్ల జాబితా సవరణపై ఇచ్చిన ఆదేశాలను ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ సవాల్ చేసింది. ఈ అంశంపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కాగా దీనిపై సోమవారం విచారణ ఉండనుంది. మరోవైపు ఈ విషయంపై ఎంపీ మహువా మొయిత్రా సైతం సుప్రీంను ఆశ్రయించారు.